← Back to Home

నిబంధనలు మరియు షరతులు(Terms and Conditions) – Warangal Property Hub

మా Warangal Property Hub వెబ్‌సైట్‌ను లేదా మా సర్వీసెస్ ను ఉపయోగించే ముందు, దయచేసి కింద పేర్కొన్న నిబంధనలు మరియు షరతులను పూర్తిగా చదవండి. ఈ వెబ్‌సైట్‌ను లేదా సర్వీసెస్ ను మీరు ఉపయోగిస్తున్నారంటే, ఇక్కడ ఉన్న అన్ని నిబంధనలకు మీరు అంగీకరించినట్లుగా పరిగణించబడుతుంది.


1. సేవల ఉద్దేశం (Purpose of Services)

వరంగల్, హన్మకొండ, కాజీపేట (ట్రై-సిటీస్) పరిధిలో ప్రాపర్టీల కొనుగోళ్లు మరియు అమ్మకాలకు సంబంధించిన నమ్మకమైన సేవలను అందించడమే 'ప్రాపర్టీ హబ్' ముఖ్య ఉద్దేశం. మా వెబ్‌సైట్‌లో ఉంచిన సమాచారమంతా కేవలం కస్టమర్ల ప్రాథమిక అవగాహన మరియు సమాచారం కోసం మాత్రమే.

2. రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ / సర్వీస్ చార్జీలు

మా ద్వారా జరిగే ప్రతి డీల్‌లోనూ, ప్రాపర్టీ కొనుగోలుదారులు మరియు అమ్మకందారులు మా అడ్వైజరీ చార్జీలు / సర్వీస్ చార్జీలు / కన్సల్టెన్సీ ఫీజును పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. మా చార్జీల వివరాలు కింది విధంగా ఉంటాయి:

  • ఆస్తి విలువ రూ. 1.5 కోట్ల కంటే తక్కువ ఉంటే: 2% సర్వీస్ చార్జ్ వర్తిస్తుంది.
  • ఆస్తి విలువ రూ. 1.5 కోట్ల కంటే ఎక్కువ ఉంటే: 1% సర్వీస్ చార్జ్ వర్తిస్తుంది.

చెల్లింపు పద్ధతి: మా మొత్తం సర్వీస్ చార్జీలలో 50% మొత్తాన్ని 'అగ్రిమెంట్ ఆఫ్ సేల్' (Agreement of Sale) సమయంలో, మిగిలిన 50% మొత్తాన్ని రిజిస్ట్రేషన్‌కు ముందే చెల్లించాల్సి ఉంటుంది.

ముఖ్య గమనిక: మేము ఒక ప్రాపర్టీని లేదా కస్టమర్‌ని పరిచయం చేసిన తర్వాత, మాకు తెలియకుండా మీరు నేరుగా సదరు కస్టమర్‌తో గానీ లేదా థర్డ్ పార్టీ ద్వారా గానీ ఒప్పందం చేసుకున్నా కూడా మా సర్వీస్ చార్జీలను పూర్తిగా చెల్లించాల్సిందే. అలాగే, మేము చూపించిన ప్రాపర్టీని మీ పేరు మీద కాకుండా, మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించినా సరే, మాకు రావాల్సిన కన్సల్టెన్సీ ఫీజును మీరు తప్పకుండా చెల్లించవలసి ఉంటుంది.

3. డైరెక్ట్ డీలింగ్స్ చేయకూడదు (No Direct Contracts)

మా ద్వారా పరిచయమైన బయ్యర్స్ లేదా ప్రాపర్టీ ఓనర్లతో మా అనుమతి లేకుండా ఎలాంటి ముందస్తు ఒప్పందాలు చేసుకోకూడదు. ఒకవేళ అలా చేస్తే, మా కంపెనీకి చెల్లించాల్సిన అడ్వైజరీ చార్జీలను మీరే భరించాల్సి ఉంటుంది. ఇది మా నిబంధనలకు పూర్తిగా విరుద్ధం మరియు దీనివల్ల చట్టపరమైన చర్యలు (Legal Action) తీసుకునే అవకాశం ఉంటుంది.

4. సమాచారం యొక్క ఖచ్చితత్వం (Accuracy of Information)

వెబ్‌సైట్‌లో ఉంచిన ప్రాపర్టీల వివరాలన్నీ వాటి యజమానులు (Owners) ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఉంటాయి. మేము ఆ వివరాలను పరిశీలించి వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసినప్పటికీ, వాటి ఖచ్చితత్వానికి మాది పూర్తి గ్యారెంటీ కాదు. కొనే ముందు లీగల్ గా చెక్ చేసుకోవడం కస్టమర్ల బాధ్యత.

5. ప్రకటనలు & ప్రమోషన్స్ (Advertisements)

మీ ప్రాపర్టీలను త్వరగా అమ్మడం కోసం వాటి ఫోటోలు మరియు పూర్తి వివరాలను మా వెబ్‌సైట్‌తో పాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌లో కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఇలా ప్రమోట్ చేయడం ఇష్టం లేకపోతే, వెంటనే మాకు తెలియజేయగలరు.

అలాగే, మా వెబ్‌సైట్‌లో కొన్ని థర్డ్ పార్టీ ప్రాపర్టీస్ లేదా అడ్వర్టైజ్‌మెంట్ లింకులు ఉండవచ్చు. వాటి ద్వారా మీరు చేసే ఎలాంటి లావాదేవీలకైనా మీదే పూర్తి బాధ్యత. అందులో జరిగే నష్టాలకు వెబ్‌సైట్ యాజమాన్యానికి ఎలాంటి సంబంధం ఉండదు.

6. కాపీరైట్ హక్కులు (Copyrights)

ఈ వెబ్‌సైట్‌లోని టెక్స్ట్, ఫోటోలు, లోగోలు మరియు డిజైన్లు అన్నీ 'Warangal Property Hub' కే సొంతం. మా అనుమతి లేకుండా ఇందులో ఉన్న ఏ సమాచారాన్ని కాపీ చేసినా లేదా ఇతర చోట్ల వాడినా చట్టరీత్యా చర్య తీసుకోబడును.

7. నిబంధనల మార్పు (Right to Change Terms)

పరిస్థితులను బట్టి 'Warangal Property Hub' తన నిబంధనలను మరియు షరతులను ఎప్పుడైనా, ముందస్తు సమాచారం లేకుండా మార్చే హక్కును కలిగి ఉంది.

మీ అంగీకారం (Your Agreement)

ఈ వెబ్‌సైట్‌ను ఉపయోగించడం ద్వారా, మీరు పైన పేర్కొన్న అన్ని నిబంధనలకు మరియు మా సర్వీస్ చార్జీల పాలసీకి పూర్తిగా కట్టుబడి ఉన్నట్లు అంగీకరిస్తున్నారు. మా 'నో డైరెక్ట్ డీలింగ్' (No Direct Dealing) విధానాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నాము.

ఈ నిబంధనలపై ఎలాంటి సందేహాలున్నా లేదా పూర్తి వివరాల కోసమైనా మమ్మల్ని నేరుగా సంప్రదించండి. ఫోన్ నెంబర్: 93466 29046.


ప్రకటనల విధానం (Advertising Policies)

మా వెబ్‌సైట్ మరియు సోషల్ మీడియా ద్వారా మీ ప్రాపర్టీలను ప్రమోట్ చేసుకోవడానికి కింది ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి:

ఓపెన్ ప్లాట్స్ (Open Plots)

  • ప్లాన్ 1 (రూ. 1999/-): ఈ ప్లాన్ తీసుకుంటే, మీ ప్రాపర్టీ పేజీలో నేరుగా మీ ఫోన్ నెంబర్ డిస్‌ప్లే చేస్తాము. కొనుగోలుదారులు (Buyers) డైరెక్ట్‌గా మీకే కాల్ చేస్తారు. ఇందులో మాకు ఎలాంటి కమిషన్ లేదా సర్వీస్ చార్జ్ ఇవ్వాల్సిన అవసరం లేదు.
  • ప్లాన్ 2 (ఉచిత ప్రకటన - Free Ad): ఇందులో ప్రకటన ఉచితం. కానీ బయ్యర్స్ మాకు కాల్ చేస్తారు. డీల్ ఓకే అయితే.. ఆస్తి విలువ రూ. 1 కోటి కంటే తక్కువ ఉంటే 2%, రూ. 1 కోటి కంటే ఎక్కువ ఉంటే 1% కన్సల్టెన్సీ/అడ్వైజరీ చార్జీలు మాకు చెల్లించాల్సి ఉంటుంది.

ఇల్లు / ఫ్లాట్ / విల్లా (House / Flat / Villa)

  • ప్లాన్ 1 (రూ. 999/-): మీ ప్రాపర్టీని మా వెబ్‌సైట్‌లో పోస్ట్ చేస్తాము. బయ్యర్స్ మాకు కాల్ చేస్తారు. డీల్ సక్సెస్ అయితే.. ఆస్తి విలువ రూ. 1 కోటి లోపు ఉంటే 2%, రూ. 1 కోటి పైన ఉంటే 1% కన్సల్టెన్సీ చార్జీలు చెల్లించాలి.
  • ప్లాన్ 2 (రూ. 1999/-): మీ ప్రాపర్టీ పేజీలో నేరుగా మీ ఫోన్ నెంబర్ డిస్‌ప్లే చేస్తాము. బయ్యర్స్ డైరెక్ట్‌గా మీకే కాల్ చేస్తారు. మాకు ఎలాంటి అదనపు కన్సల్టెన్సీ లేదా సర్వీస్ చార్జీలు ఇవ్వక్కర్లేదు.
  • ప్లాన్ 3 (రూ. 3999/- - ప్రీమియం): మీ ప్రాపర్టీని మేము ప్రొఫెషనల్‌గా వీడియో ఎడిటింగ్ చేసి, మా వెబ్‌సైట్‌తో పాటు సోషల్ మీడియాలో కూడా ప్రమోట్ చేస్తాము. మీ నెంబరే డిస్‌ప్లే అవుతుంది, బయ్యర్స్ మీకే కాల్ చేస్తారు. ఇందులో కూడా మాకు ఎలాంటి కమిషన్ ఇవ్వనక్కర్లేదు.

వ్యవసాయ భూమి (Agricultural Land)

  • ప్లాన్ 1 (రూ. 1999/-): మీ ప్రాపర్టీ పేజీలో మీ ఫోన్ నెంబర్ చూపిస్తాము. బయ్యర్స్ మీకే కాల్ చేస్తారు. మాకు ఎలాంటి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు.
  • ప్లాన్ 2 (ఉచిత ప్రకటన - Free Ad): ప్రకటన ఉచితం, కాల్స్ మాకు వస్తాయి. డీల్ సక్సెస్ అయితే.. భూమి విలువ రూ. 1 కోటి లోపు ఉంటే 2%, రూ. 1 కోటి పైన ఉంటే 1% కన్సల్టెన్సీ చార్జీలు వర్తిస్తాయి.